తెలంగాణలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసుపై చర్చ నడుస్తూనే ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఏ11గా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తుండగా.. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఒకవేళ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఏ11 అయినప్పుడు.. ఇటీవల జరిగిన మెదక్ ఘటనలో రేవంత్ రెడ్డి కూడా ఏ11 కావాలికదా అంటూ గట్టి లాజిక్కే లాగారు ఆర్ఎస్పీ.