స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుతో పాటుగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఉన్న క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం పలు హస్తకళా రూపాలను తిలకించారు. ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ద్వారా సుమారు ఐదు వేల హస్త కళాకారుల కుటుంబాలకు ముడి సరుకు సమస్య తీరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.