కాకినాడ జిల్లా పిఠాపురంలో ఒక్క విద్యార్థి కోసం స్కూలు ఉపాధ్యాయుడు స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిఠాపురం పరిధిలోని ఓ మున్సిపల్ స్కూలులో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఒక్క విద్యార్థి కోసం జెండాను ఎగరవేసి పంద్రాగస్టు పండుగ నిర్వహించారు. ఈ వేడుక కోసం ఊరిలోని 30 మంది అతిథులు, ఇతర పిల్లలు కూడా హాజరు కావడం విశేషం.