నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ అట్టుడుకుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గతరాత్రి నిర్మల్ ఆర్డీవో కారుపై దాడికి యత్నించారు. కారుపై దాడి చేసి నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇవాళ ఉదయం దిలావర్‌పూర్ గ్రామానికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు గతరాత్రి దాడిలో పాల్గొన్న రైతులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. ఉదయం నుంచి నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించటంతో రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు