తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలైన.. సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి పరోక్షంగా కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల వ్యవహారం సభలో దుమారం రేపింది. అయితే.. వీటిపై రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియాతో చేసిన చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.