హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని కారుమూరు ప్రియాంక రెడ్డి అమెజాన్‌లో రికార్డు స్థాయి ₹1.4 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించారు. ఆమె విద్యా ప్రదర్శన, సాంకేతిక నైపుణ్యాలతో ఈ విజయం సాధించింది. ప్రియాంక విజయం గీతం విద్యాసంస్థకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని కళాశాల యాజమాన్యం తెలిపింది.