TTD Appeal On False Social Media Posts On Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో కొబ్బరి పీచు బయటపడిందని ఫోటో వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై టీటీడీ స్పందించింది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందనడం బాధ్యతా రాహిత్యం.. కానీ ఆ ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని టీటీడీ తెలిపింది.