'అది ప్రార్థనా స్థలం.. ఎవరి జాగీరు కాదు'.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనపై మాధవీలత కౌంటర్ కామెంట్స్

5 months ago 22
ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని మహిళల ప్రార్థనా మందిరంలో ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటున్న సమయంలో బీజేపీ నేత మాధవీలత గట్టిగా దుర్గాస్తుతి పఠించడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన మాధవీలత.. ఇది లౌకిక దేశమని, ఎయిర్‌పోర్టులోని ప్రార్థనా స్థలం ఎవరి జాగీరు కాదని స్పష్టం చేశారు. విదేశాల్లో విమానాల్లోనే బహిరంగంగా ప్రార్థనలు చేస్తారని, మక్కాలో వీడియోలు తీసుకున్నప్పుడు లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకని ఆమె విమర్శకులను ప్రశ్నించారు.
Read Entire Article