తెలంగాణలో పథకాలు అమలు చేసే పనిలో రేవంత్ రెడ్డి సర్కార్ నిమగ్నమైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే.. అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్. అయితే.. ఈ పథకాన్ని ప్రారంభించగా చాలా మందికి ఇంకా డబ్బులు రాలేదు. ఈ నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.