ఏపీలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాలపై కసరత్తు జరుగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులోభాగంగా విశాఖ మెట్రోను డబుల్ డెక్కర్ తరహాలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందుకు కేంద్రం అంగీకరించి.. విశాఖ మెట్రో ప్రాజెక్టు పూర్తి అయితే ఆసియాలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రో ఏపీలోనే ఉండనుంది.