టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఎవరెవరు ఏమన్నారనేదీ రికార్డు తమ వద్ద ఉందన్న బుద్ధా వెంకన్న.. రాజకీయాలు వదిలేస్తామన్న వదిలేది లేదని హెచ్చరించారు. మంచోళ్లు అయితే టీడీపీలో చేరవచ్చన్న బుద్ధా వెంకన్న.. అధికారం ఉందనే అహంకారంతో అప్పట్లో మాట్లాడిన వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకుంటామంటే తొలుత తానే వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.