దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చియోంగీచియాన్ నదీ పరిసరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఒకప్పుడు మురికి కూపంగా ఉన్న నదిని వాటర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను గురించి తెలుసుకున్నారు. మూసీ నదిని కూడా ఇదే తరహాలో అభివృద్ది చేయాలని భావిస్తున్నారు.