ఓ వెరైటీ దొంగను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లల్లో దొంగతనాలు చేస్తే కష్టపడి డబ్బులు పోగేసుకున్నవారు బాధపడతారనే ఉద్దేశంతో.. ఈ దొంగ కేవలం షాపింగ్ మాల్స్ టార్గెట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు .అనంతపురంలో జరిగిన ఓ షాపింగ్ మాల్ చోరీ కేసు దర్యాప్తులో ఆనంద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై తెలుగు రాష్ట్రాలతో పాటుగా పలుచోట్ల 33 వరకూ కేసులు ఉన్నాయని వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో అదనపు ఎస్పీ ఈ కేసు వివరాలు పంచుకున్నారు.