Anantapur Woman Donated 5 Acres Free: ఆరేళ్ల క్రితం ఆ ఊరిలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఓ భవనంలో తరగతులు ప్రారంభించారు.. కానీ భవనాల నిర్మాణం కోసం భూమి లేకుండా పోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను మళ్లి నిధులు తీసుకొస్తానని చెప్పారు.. అయితే భూమి మాత్రం లేదు. ఈ క్రమంలో మహిళా రైతు ముందుకొచ్చి తన ఐదెకరాల భూమిని దానం చేశారు.