Anantapur Mbbs Final Year Student Suicide: అనంతపురంలో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఉరవకొండకు చెందిన శివప్రసాద్, శారద దంపతుల కుమారుడు వీర రోహిత్ అనంతపురం మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. డిసెంబరులో పరీక్షల ఉండటంతో..కాలేజీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. అయితే హాస్టల్ గదిలో ఉరి వేసుకుని రోహిత్ ప్రాణాలు తీసుకున్నాడు.. తన చావుకు తానే కారణమని, ఆలోచనల నుంచి బయట పడలేకపోతున్నానని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.