కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మ ఓ చిన్నారి ప్రాణం తీసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటుచేసుకుంది. గుత్తి మున్సిపాలిటీలోని కోటకు చెందిన ఫర్హాన్ అనే ఐదేళ్ల బాలుడు.. మంగళవారం సాయంత్రం కుర్ కురే ప్యాకెట్లలో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటూ అనుకోకుండా వాటిని మింగేశాడు. ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని శ్వాస అందక ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆస్పత్రికి తరలించే సరికి.. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.