రాష్ట్రంలో సంచలనం రేపిన అనంతపురం హనీట్రాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో ప్రధాన నిందితురాలు రంగమ్మనాయుడు సహా మొత్తం ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ధనికులే టార్గెట్‌గా వారికి అమ్మాయిలతో ఎర వేసి.. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 20 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.1 కోటి వరకు నిందితులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.