అనంతపురంలో హనీట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. మహిళలను ఎరగా వేస్తూ లక్షలలో దోచుకుంటున్న ముఠాకు చెందిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా బారినపడిన పలువురు హనీట్రాప్ బాధితులు పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు హనీట్రాప్ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారంటూ ఇద్దరు సీఐలపై చర్యలు తీసుకోవటం సంచలనం రేపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న పది మందిని విచారిస్తున్నట్లు సమాచారం.