Anakapalli Son In Law Steals Gold: అనకాపల్లి జిల్లాలో అత్తింట్లో అల్లుడి ఘనకార్యం బయటపడింది. ఏం తెలియదన్నట్లు అంతా బానే కవర్ చేశాడు.. కానీ అత్తింటి పక్కన ఉండే వాళ్లు చెప్పడంతో అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల ఎంట్రీతో కథ ముగిసింది.. అల్లుడు జైలు పాలయ్యాడు. రోలుగుంట మండలం శరభవరంలోని ఓ ఇంట్లో గతవారం జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు.. నిందితుడు ఆ ఇంటి అల్లుడు సింహాచలంగా గుర్తించారు.