అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానసిక ఆరోగ్యం సరిగా లేని ఓ కన్న తల్లి.. తన 40 రోజుల బిడ్డను నదిలో వదిలేసింది. అనంతరం భర్తకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో భర్త, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈ ఘటన జరగ్గా.. ఆ కుటుంబం భోరున విలపిస్తోంది. ప్రసవం అనంతరం ఆ మహిళకు మానసిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది.