అనకాపల్లి జిల్లాకు మరో భారీ పెట్టుబడి వస్తోంది. రాంబిల్లి మండలంలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.5400 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గురువారం రోజున (ఏప్రిల్ 23) ఈ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరగనుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.