అసభ్య కామెంట్స్ ఆరోపణలతో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేయగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. మీడియాలో ప్రెస్‌మీట్‌లో పలువురు ప్రముఖులపై అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై ఏపీలోని 16 ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆయన ఇటీవల హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కడపకు తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిందనే ఫిర్యాదుతో ఆయన హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు సీఐ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.