Annadata Sukhibhava Ekyc and NPCI Mapping: ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ రెండో తేదీన అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. ఈ కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పెండింగ్ ఉన్న రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సీఎస్ సూచించారు. అలాగే అలాంటి వారికి మెసేజులు పంపించాలని ఆర్టీజీఎస్ అధికారులను ఆదేశించారు.