అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

8 months ago 10
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 11మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా కర్ణాటకకు చెందినవారిగా గుర్తించారు.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి సొంత ఊరికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Read Entire Article