Annavaram Janmabhoomi Visakha Express Trains Stopped: అన్నవరంలో సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు ఆగిపోయింది. విశాఖ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక సమస్యతో నిలిచిపోగా.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అక్కడే నిలిపివేశారు. జన్మభూమి రైలు ఇంజన్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు తగలించి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌ను మరమ్మత్తు చేసి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు కలిపిన తర్వాత అక్కడి నుంచి వెళ్లింది.