బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారబోతున్నారంటూ గత రెండ్రోజులు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు అంశంపై ఆర్ఎస్పీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీ మారటం లేదని.. కావాలనే కాంగ్రెస్ సోషల్ మీడియా టీం దుష్ప్రచారం చేస్తుందని చెప్పారు. తన ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌తోనే సాగుతుందని స్పష్టం చేశారు.