తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సర్వీసు రికార్డులను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ఈ-హెచ్ఆర్ఎంఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి ఉద్యోగికి డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ నిర్వహించనున్నారు. సెలవులు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, బదిలీలు, ఏసీఆర్, ఏపీఏఆర్, స్థిరాస్తుల వివరాలు, విజిలెన్స్, పదవీ విరమణ వ్యవహారాలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈ వ్యవస్థ అమలు పర్యవేక్షణ బాధ్యతలను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్కు అప్పగించారు.