తెలంగాణలో అన్ని రకాల భూముల సమగ్ర రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. మొదటి దశలో 2,720 గ్రామాల్లో చేపట్టిన సర్వేను నవంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయింది. డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్ సాంకేతికతతో భూముల హద్దులను గుర్తించి భూభారతి పోర్టల్లో వివరాలు నమోదు చేయనున్నారు. సర్వేకు ముందు రైతులకు నోటీసులు ఇవ్వాలని, అభ్యంతరాలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.