హైదరాబాద్ శివారు కీసర మాజీ ఇన్స్పెక్టర్ అరకపల్లి ఆంజనేయులుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. లంచం కేసులో అరెస్టయిన ఆయనకు హైదరాబాద్ పరిసరాల్లో స్థలాలు, ఇళ్లు, వ్యవసాయ భూములు, బంగారం, నగదు ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. అధికారికంగా గుర్తించిన ఆస్తుల విలువ రూ.2.28 కోట్లు కాగా.. మార్కెట్ విలువ రూ.20 కోట్లకు పైగా ఉండవచ్చని సమాచారం. ఆస్తుల మూలాలు, బినామీ లావాదేవీలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.