అబ్బబ్బ.. ఏమన్నా తెలివా.. వడ్లు లేవు, బియ్యం లేవు.. మిల్లర్ల రూ.కోట్ల స్కామ్ వెలుగులోకి..

5 months ago 7
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన రూ. 2 వేల కోట్లకు పైగా స్కామ్ బయటపడింది. రైస్ మిల్లర్లు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఏకమై, వడ్లు కొనకుండానే కొన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు విజిలెన్స్ తనిఖీలు చేయగా ఈ ఫేక్ ట్రక్ షీట్ల దందా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు తేలింది. ఈ అక్రమాలలో మాజీ ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Read Entire Article