తెలంగాణ ప్రభుత్వం మూసీ ఒడ్డున బాపూ ఘాట్ అభివృద్ధి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో బాపూ ఘాట్‌ను అభివృద్ది చేయనుండగా.. అక్కడ మూసీ, ఈసా, గోదావరి నదులు కలుస్తున్నందను త్రివేణి సంగమంగా డెవలప్ చేసేందుక సిద్ధమయ్యారు. ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహంతో పాటుగా.. అతిపెద్ద వీల్ ఆఫ్ లైఫ్ జెయింట్ వీల్ సైతం నిర్మించనున్నారు.