ఆంధ్రప్రదేశ్ రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకుపడింది. ఇప్పటికే యాక్సెస్ కంట్రోల్ ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్రవేసిన సంగతి తెలిసిందే. ఆరు లైన్లుగా 189.4 కిలో మీటర్లు పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌కు సంబందించి తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 16,310 కోట్ల వ్యయం అవుతుందనే అంచనా వేస్తున్నారు.