రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి మొదలైన అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 ప్రస్తుతం రాష్ట్ర స్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గం, జిల్లా స్థాయి పోటీలు ముగియడంతో ఆగస్టు 24 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు శాప్ ఛైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలను తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతికి వచ్చే మొత్తం 16 వేల మందికి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విజేతలకు జాతీయ క్రీడా దినోత్సవం రోజున విజయవాడలో బహుమతులు అందజేయనున్నారు.