పేద రోగులకు తీపి కబురు. నేటి నుంచి సనత్‌నగర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా విదేశీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను ప్రారంభించనున్నారు. తొలి విడతలో 582 పడకలతో సేవలు అందుబాటులోకి రానుండగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే తక్కువ ధరలో విదేశీ రోగులకు చికిత్స అందించనున్నారు. పేదలకు వైద్యం పూర్తిగా ఉచితం. 37 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 300కుపైగా ఐసీయూ పడకలు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి, రోబోటిక్ చికిత్స, ట్రామా కేర్ వంటి అధునాతన సదుపాయాలు టిమ్స్‌లో ఉన్నాయి.