ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దిశగా మరో కీలక అడుగు పడింది. అమరావతిలో పలు నిర్మాణాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పలు జోన్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ. 2.300 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. సీఆర్‌డీఏ ద్వారా రూ. 1,470 కోట్లు, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ. 852 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. వీటితో పాటు నీరుకొండ రిజర్వాయర్ వరద నియంత్రణ పనులకు సైతం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. జనవరి 22 వరకూ టెండర్లు దాఖలకు అవకాశం కల్పించారు.