గుంటూరు నుంచి అమరావతి వెళ్లే మార్గంలో 7.2 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా తయారైంది. దీని మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. లాంఫామ్ వద్ద పరిస్థితి దారుణంగా ఉండటంతో.. రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయి. కమీషన్ల కోసం ఆశపడి నాసిరకం పనులు చేస్తే ఇలానే ఉంటుందని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈసారి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు కోరుకుంటున్నారు. మే 2న ప్రధాని పర్యటన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన రోడ్డును బాగు చేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.