ఏపీ శాసనమండలిలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా.. వైసీపీ ఎమ్మెల్సీలకు, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి ఉద్యమ సమయంలో అమరావతి మహిళలను బూటు కాళ్లతో తన్నించిన వైసీపీకి.. మహిళల గురించి మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్స్యనారాయణ, పంచుమర్తి అనురాధ మధ్య కాసేపు వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో మూడు రాజధానులు అనేది అప్పటి మా ప్రభుత్వ విధానమని బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే అమరావతిని శ్శశానం అన్న మాట వాస్తవేమనన్న బొత్స.. అప్పటి సందర్భంలో అన్నానని వివరణ ఇచ్చారు. అమరావతి శ్మశానం అయితే మీరు కాటికాపరా అంటూ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.