Amaravati Outer Ring Road Update: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముందుగా రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని వేగవంతం చేసింది. అమరావతికి కీలకంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీని కోసం ఓఆర్‌ఆర్ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. ఓఆర్‌ఆర్ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది.