ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులలో వేగం పెరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మే రెండో తేదీన అమరావతి రాజధాని నిర్మాణ పనులకు పునఃప్రారంభం చేయనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది.