Amaravati ORR Connect With 7 National Highways: ఏపీ ప్రభుత్వం అమరావతి పనుల్ని వేగవంతం చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక సమీక్ష చేశారు. ఎలైన్‌మెంట్, ప్రతిపాదిత మ్యాప్‌ను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అమరావతి ఓఆర్‌ఆర్‌ను ఏకంగా ఏడు జాతీయ రహదారులతో కనెక్ట్ చేయాలని నిర్ణయించారు. అలాగే వీలైనంత త్వరగా ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు.