Dhulipalla on Ponguleti over Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిన నరేంద్ర.. పొంగులేటికి వైఎస్ జగన్ స్నేహం తాలూకు వాసనలు ఇంకా పోనట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏపీకి వచ్చిన పెట్టుబడులే.. ఆయన విజన్, అమరావతి ప్రగతికి నిదర్శమంటూ ధూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు.