అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటుగా పలువురు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం డీపీఆర్ తయారీకి కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కన్సల్టెన్సీల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది.