ఏపీని అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన వెల్లడించారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో "ఏషియన్ - ఇండియా మారిటైం కాంక్లేవ్" కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్‌తో మంత్రి లోకేశ్ విశాఖలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.