పిఠాపురం మున్సిపాలిటీలో హైటెన్షన్ .. రెండు వర్గాలుగా విడిపోయిన జనసేన కౌన్సిలర్లు.. గందరగోళం

59 minutes ago 1
కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ సాగింది. ఈ ఎన్నిక సందర్భంగా జనసేన పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకే పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికల ప్రక్రియ కొంతసేపు ఆగిపోయింది. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండేలా కౌన్సిలర్లను ఒప్పించడంతో, చివరకు బొజ్జ వెంకటేశ్వర రావు పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Entire Article