Basavatarakam Cancer Hospital In Amaravati: అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రికి అడ్డంకి తొలగింది. ఈ మేరకు ఆస్పత్రికి కేటాయించిన స్థలం దగ్గర హెచ్‌టీ విద్యుత్ వైర్లను తొలగించారు. మూడు భారీ టవర్లను నిర్మించి ఆ విద్యుత్ లైన్లను మార్చేశారు విద్యుత్‌శాఖ సిబ్బంది. బాలయ్య లేఖ రాయడంతో వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. దీంతో ఆస్పత్రి నిర్మాణానికి లైన్ క్లియర్ కాాగా.. త్వరలోనే నిర్మాణ పనుల్ని ప్రారంభించనున్నారు.