అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 13వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. 21 ఎకరాల్లో మూడు దశల్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. తొలి దశలో 300 పడకలతో ప్రారంభించి, ఆ తర్వాత 1000 పడకలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు.