అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు రెండో దశ భూసేకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌సిటీ వంటి వాటికి భూములు అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రెండో దశ భూసేకరణకు సంబంధించి చర్చించారు. 7 గ్రామాల పరిధిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర మంత్రివర్గం. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 20 వేల ఎకరాలు సేకరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టే గ్రామాలను మంత్రివర్గం పరిశీలించినట్లు తెలుస్తోంది.