రాజధాని అమరావతిలో వైల్డర్నెస్ పార్కు అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. శాఖమూరులో ఏర్పాటు చేసే అమరావతి సెంట్రల్ పార్కులోనే ఈ వైల్డర్నెస్ పార్కును అభివృద్ధి చేయాలని 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిర్ణయించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో ఈ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో వైల్డర్నెస్ పార్కు పనులు మొదలయ్యాయి. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకుని రావాలని అమరావతి అభివృద్ధి సంస్థ.. ప్రగతి సంస్థను ఆదేశించింది.