రాజధాని అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తం రెండు దశల్లో రూ.260 కోట్లతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. రెండున్నరేళ్లలో ఆలయ విస్తరణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతిని దేవతల రాజధాని నమూనాగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను ఆయన అభినందించారు. ఈ ఆలయ అభివృద్ధి ప్రణాళికను గత ప్రభుత్వం భారీగా తగ్గించిందని విమర్శించారు.