సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగానే తల్లి రజిత పిల్లలను చంపేసిందని పోలీసుల విచారణలో తేలింది. భర్త చెన్నయ్యను కూడా చంపాలని భావించగా.. ఆరోజు అతను పెరుగన్నం తినకపోటవంతో ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. పిల్లలను చంపేసిన తర్వాత సినిమా నటులను మించి నాటకం ఆడిన రజిత ఆసుపత్రిలో చేరిందని పోలీసులు తెలిపారు.